సారథి న్యూస్, రామడుగు: చైనా సరిహద్దులో శత్రు మూకల దాడిలో అమరుడైన తెలంగాణ కు చెందిన వీర జవాన్ సంతోష్ బాబు కు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శానగర్లో సోమవారం నివాళి అర్పించారు. సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి.. అతడి సేవలను కొనియాడారు. ప్రతి ఇంట్లోనూ ఓ సంతోష్‌బాబు తయారు కావాలని ఆకాంక్షించారు
సారథి న్యూస్, ఎల్బీనగర్: భారత్, చైనా సైనికుల ఘర్షణలో అమరుడైన కల్నాల్ సంతోష్ బాబు, ఇతర అమర సైనికులకు బీజేపీ మన్సురాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సహారా ఎస్టేట్ చౌరస్తాలోని వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కడారి యాదగిరి యాదవ్, మన్సురాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పాతూరి శ్రీధర్ గౌడ్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవరకొండ లింగాచారి, వేణు గౌడ్, బీజేవైఎం మన్సురాబాద్ డివిజన్ సంద […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరజవాన్ కల్నల్ సంతోష్ బాబు సతీమణి, పిల్లలు బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారిని రిసీవ్ చేసుకున్నారు. అమరజవాన్ కుటుంబసభ్యులతో సీపీ, ఇతర పోలీస్ అధికారులు చాలా సేపు వారితో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. వారిని ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తీసుకెళ్లనున్నారు. మంగళవారం చైనా బలగాల దొంగ దెబ్బకు కల్నల్ సంతోష్‌బాబు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇండియా– చైనా సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణలో మంగళవారం సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై సీఎం కేసీఆర్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ఆయన ఆదేశించారు.