Breaking News

సంక్రాతి

సంక్రాతిని కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలి

సంక్రాతిని కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలి

 సామాజిక సారథి, రేగొండ: మండల ప్రజలు ఆనందంగా మకర సంక్రాంతి వేడుకలను కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలని రేగొండ మండల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనవసరంగా బయటకు వెళ్ళొద్దని, వెళ్లినా కూడా మాస్కు, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Read More
సొంతూరుకు చలో!

సొంతూరుకు చలో!

సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు ఎక్స్​ట్రా ఛార్జీలు లేకుండానే ఏర్పాటు తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాలకు.. 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సు సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్​మహానగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు […]

Read More