Breaking News

వేములవాడ

పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. దీంతో పేదలు, కూలీలు, యాచకులు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. మంగళవారం 32వ రోజు పేదలకు ఆహారం అందజేశారు. పేదల కోసం శ్రమిస్తున్న మొట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, వర్కింగ్ టీంలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.

Read More
రాజన్నగోశాల సందర్శన

రాజన్నగోశాల సందర్శన

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలను ఆదివారం ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ సందర్శించారు. వర్షాకాలం వచ్చినందున గోశాలలోని కోడెలకు గిట్టల చీల్పు, నోటి బొబ్బలు, పొదుగు వాపు, పిడుదులు, గోమార్లు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రతి కోడెకు వర్షాకాలంలో విధిగా టెస్టులు చేయించాలని సూచించారు. డీ వార్మింగ్‌ చేయించాలని, ఇతర వ్యాధుల బారిన పడకుండా తప్పనిసరిగా టీకాలు వేయించాలని గోశాల ఇన్ చార్జ్ శంకర్ కు సూచించారు. […]

Read More
ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్

ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్

సారథి, వేములవాడ: వేములవాడ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల చంద్రశేఖర్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో ఉద్యోగులు తమ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా సిరిగిరి శ్రీరాములు, గౌరవ సలహాదారులుగా సంకేపల్లి హరికిషన్ , ప్రధాన కార్యదర్శిగా పేరుక శ్రీనివాస్, ట్రెజరర్ గా ఒన్నారం భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా నక్క తిరుపతి, ఉపాధ్యక్షుడిగా వరి నరసయ్య, వెంకటలక్ష్మి, కార్యవర్గసభ్యులుగా అరుణ్ కుమార్, నునుగొండ రాజేందర్, గుండి నరసింహమూర్తి, […]

Read More
రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ డెయిరీ పేరుతో ఉన్న వాహనంలో తరలిస్తున్న సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. డ్రైవర్ అనిల్, ఓనర్ తిరుపతిని అదుపులోకి తీసుకుని వేములవాడ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రమేష్, తిరుపతి, రాజేష్ పాల్గొన్నారు.

Read More
జర్నలిస్టుల గొంతు నొక్కడం అప్రజాస్వామికం

జర్నలిస్టుల గొంతు నొక్కడం అప్రజాస్వామికం

సారథి, వేములవాడ: అధికార పార్టీ నాయకుల భూకబ్జాల వ్యవహారాన్ని బయటకు తీస్తున్న జర్నలిస్ట్ రఘును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే జర్నలిజానికి విలువ లేకపోతే సామాన్య ప్రజలకు భద్రతే లేకుండా పోతుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాచరిక పోకడలు మంచిది కాదని హితవుపలికారు. ప్రజలు అధికార పార్టీల పోకడలను నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని […]

Read More
నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో గురువారం ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. రైతులను ఎవరైనా నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుల మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై గ్రామాల్లో పోలీసుల నిఘా ఉంటుందని. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలుచేసి రికార్డులు పొందాలన్నారు. తనిఖీల్లో వేములవాడ డీఎస్పీతో పాటు […]

Read More
టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా విజృంభిస్తున్న సమమయంలో పేదలు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ అధినేత తోట రాంకుమార్ ముందుకొచ్చి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లాక్ డౌన్ ముగిసేవరకు కొనసాగుతుందని తెలిపారు. ఎంక్వయిరీ టీంసభ్యులు కూడా అన్నివేళలా సహకరిస్తున్నారని ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ అన్నారు.

Read More
పండ్లు, మాస్కులు పంపిణీ

పండ్లు, మాస్కులు పంపిణీ

సారథి, వేములవాడ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏడేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలాధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్యర్యంలో పేదలు, రైతులు, హమాలీలకు సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీనవీన్ యాదవ్ పాల్గొన్నారు. మండలంలోని ఫాజిల్ నగర్, తుర్కషినగర్, వట్టెంల, నమిలిగుండుపల్లి, నుకలమర్రి గ్రామాల్లో సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం […]

Read More