Breaking News

వేములవాడ

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

సారథి, వేములవాడ: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం వేములవాడ పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నుంచి సమస్త భూప్రపంచాన్ని కాపాడాలని అల్లాహ్​ను ప్రత్యేక ప్రార్థనలతో వేడుకున్నారు. వేములవాడ పట్టణంలోని జామే, మహ్మదీయ, ఆర్ఫా, మెయిన్, మదీనా మసీదుల్లో ప్రత్యేక నమాజు చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపల్లి ఇస్లాంనగర్, రుద్రవరం, శాత్రాజపల్లి, ఫజల్ నగర్ జామే మసీద్ లో మత గురువు బక్రీద్ పండుగ విశిష్టత, చారిత్రక […]

Read More
ప్రభుత్వ ఆస్పత్రిలో పిడియాట్రిక్ సేవలు

ప్రభుత్వ ఆస్పత్రిలో పిడియాట్రిక్ సేవలు

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో పిడియాట్రిక్ వైద్యసేవలు అందించేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. మంగళవారం వేములవాడ మండలం తిప్పాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 50 పడకల్లో భాగంగా 20 పడకలు ఐసీయూ, మిగతా 30 పడకలు జనరల్ కు కేటాయించాలని ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంక్​పనులను […]

Read More
రాజన్న ఆలయ ఉద్యోగులకు పదోన్నతి

రాజన్న ఆలయ ఉద్యోగులకు పదోన్నతి

సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అరుణ్, గుండి నరసింహమూర్తి, వెళ్ది సంతోష్ పర్యవేక్షకులుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను ఆలయ ఈవో డి.కృష్ణప్రసాద్ అందజేశారు. ఉద్యోగ సంఘం వినతి మేరకు దీర్ఘకాలంగా ఉన్న ఖాళీపోస్టుల్లో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన ఈవో అధ్యక్షుడు చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Read More
న్యాయం కోసం వారి తపన మరువలేనిది

న్యాయం కోసం వారి తపన మరువలేనిది

సారథి, వేములవాడ: స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు న్యాయవాదుల పాత్ర మరువలేనిదని గోదావరి అర్బన్ మల్టీ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ వేములవాడ శాఖ సీఈవో, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాచమనేని శ్రీనివాసరావు కొనియాడారు. శనివారం అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, భూమేష్, రేగుల దేవేందర్, గోపి, కిషోర్ రావు, అనిల్, గుడిసె సదానందం, నక్క దివాకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. […]

Read More
19 నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

19 నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

సారథి, వేములవాడ: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని, ఈనెల 19 తేదీ నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మాతంగి కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు www.telangana.gov.in, లేదా www.tswrais.inవెబ్ సెట్ ల లో ప్రవేశ పరీక్ష ఫలితాలను సరిచూసుకోవాలని కోరారు. మొదటి దశ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు […]

Read More
రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్

రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ లాల్ సింగ్ ఆర్యా ఉదయం దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులతో వేదోక్తంగా ఆశీర్వచనం తీసుకున్నారు. వారికి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయన వెంట మంత్రి శ్రీనివాస్ తో పాటు రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర […]

Read More
కాంగ్రెస్​నేతల అరెస్ట్​సరికాదు

కాంగ్రెస్ ​నేతల అరెస్ట్​ సరికాదు

సారథి, వేములవాడ: టీపీసీసీ చీఫ్​ఎనుముల రేవంత్ రెడ్డి తలపెట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కాంగ్రెస్​మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా నేతృత్వంలో తరలివెళ్తున్న వారిని శుక్రవారం కోనరావుపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ ​చేశారు. ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ.. పోలీసుల పహారాలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిరోజులు రాజ్యమేలుతారో చూద్దామని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఎంత మందిని నిర్బంధించినా ప్రజల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. […]

Read More
రాజన్న సన్నిధిలో మత్యశాఖ కమిషనర్

రాజన్న సన్నిధిలో మత్స్యశాఖ కమిషనర్

సారథి, వేములవాడ: దక్షిణకాశీ ఆలయంగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబసమేతంగా రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్య దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అభిషేకం అనంతరం లడ్డూ ప్రసాదం అందజేశారు.

Read More