సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం రాష్టీయస్వయంసేవక్సంఘ్ అఖిల భారతీయ గ్రామవికాస్ సహ ప్రముఖ గురురాజాజీ, పద్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయఅర్చకులు, వేదపండితులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి వారి అభిషేకం లడ్డూ, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందు పరిషత్ సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు, భజరంగ్ దళ్ ప్రముఖ్ యశ్వంత్ ఉన్నారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపూర్ గోశాల నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కీలనపల్లి గ్రామ వినాయక గోశాల వెల్ఫేర్ సొసైటీకి 20 కోడెలను శనివారం వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో గోలి శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఎల్.రాజేందర్, గోశాల ఇన్చార్జ్శంకర్ పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ సర్వేనం.41,42,43 వక్ఫ్ బోర్డు భూముల్లో నిర్మిస్తున్న అక్రమకట్టడాలను కాపాడాలని పలువురు ముస్లింలు శనివారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. తిప్పాపూర్ లో చాలా వరకు వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమై ఉన్నాయన్నారు. వాటికి రక్షణ కంచె వేసి కాపాడాలని కోరారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు వేములవాడ అర్బన్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఏకైక కైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి లడ్డూప్రసాదం అందజేసి సత్కరించారు.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇటీవల జర్మనీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మొదటిసారి బుధవారం వేములవాడ రెండవ బైపాస్ రోడ్డులోని గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ప్రజలకు దూరంగా ఉంటారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. కొవిడ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబసభ్యులతో జర్మనీలోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా పూసల సంఘం సభ్యులు బుధవారం వేములవాడ కమాన్ చౌరస్తాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముద్రకోల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ముద్రకోల వెంకటేశం, కోశాధికారిగా ముద్రకోల గణేశ్నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 17 గ్రామాలకు చెందిన 70 మంది పూసల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్కర్ణన్ ను బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభిషేకం లడ్డూప్రసాదం అందజేసి ఆనందం వ్యక్తం చేశారు.