సారథి న్యూస్, రామాయంపేట: పంటలకు చీడపీడలను తొలగించేందుకు వేపనూనె బాగా పనిచేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి పరుశురాం నాయక్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంది, చెరకు పంటలకు తెగుళ్లు సోకకుండా ముందు జాగ్రత్తగా వేప నూనె ను పిచికారీ చేసుకోవాలని సూచించారు. గురువారం ఆయన మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట, నస్కల్ గ్రామాల్లో పర్యటించారు. అనంతరం రైతులకు జాగ్రత్తలు సూచించారు. ఆయన వెంట ఏడీఏ వసంత సుగుణ, మండల వ్యవసాయాధికారి సతీశ్, ఏఈవోలు గణేశ్, కుమార్, శ్రీలత […]