సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పదో తరగతి(tenth class) ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్(ssc) ఫలితాల కోసంwww.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.inవెబ్సైట్లో సంప్రదించాలని కోరారు.
కరోనా నిలకడగానే ఉంది మూడో దశ ముప్పుపట్ల అప్రమత్తంగా ఉండాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సామాజిక సారథి, హైదరాబాద్: కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి సోమవారం కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యాసంస్థల్లో ఎవరికి వారు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 6, 7, 8వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తరగతులను మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మంత్రి స్పష్టంచేశారు.
అమరావతి: పదవ తరగతి పరీక్షలను ఏపీలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. కరోనా నేపథ్యంలో.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేరెంట్స్ ఆందోళన చెందుతున్న వేళ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం వెల్లడించారు.