Breaking News

రామడుగు

వర్షాల వేళ అలర్ట్​గా ఉండండి

వర్షాల వేళ అలర్ట్​గా ఉండండి

సారథి, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్​జిల్లా రామడుగు ఎస్సై తాండ్ర వివేక్ గురువారం సూచించారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, గోడలను తాకవద్దని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. గృహిణులు జే వైర్లపై బట్టలను ఆరవేయకూడదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న మట్టి ఇళ్లు, గోడల మధ్య ఉండకూడదని కోరారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం సమయంలో ప్రజలు, […]

Read More
ఘనంగా బక్రీద్ వేడుకలు

ఘనంగా బక్రీద్ వేడుకలు

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని జామా మసీద్ లో ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీక నిలిచే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సదర్ ఖాజీ అబ్దుల్ మజీద్ మహమ్మద్, యూనుస్ మహమ్మద్, ఖదీర్, అసిఫ్, మొయిజ్, అదిల్, అజీజ్ పాల్గొన్నారు.

Read More
ఆధునికత వైపు ‘సాగు’తున్నారు..

ఆధునికత వైపు ‘సాగు’తున్నారు..

వ్యవసాయంలో నూతన పద్ధతులు పెరిగిన యంత్ర పరికరాల వాడకం సారథి, రామడుగు: సంప్రదాయ సాగును వదిలి రైతులు ఆధునికత వైపునకు అడుగులు వేస్తున్నారు. కొత్త కొత్త పరికరాలతో వ్యవసాయ పనులు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అటు కూలీల కొరత తగ్గించుకోవడంతో పాటు ఇటు అధిక దిగుబడిని సాధిస్తూ లాభాల వైపు సాగుతున్నారు. నాట్లు వేసే యంత్రంతో కొందరు, వెదజల్లే పద్ధతిలో ఇంకొందరు, డ్రమ్ సీడర్ తో మరికొందరు.. ఇలా వరి సాగు పనులు చేపడుతున్నారు. […]

Read More
‘ధరణి’తో ఆ బాధలు తీరినయ్​

‘ధరణి’తో ఆ బాధలు తీరినయ్

సారథి, రామడుగు: గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని భూములను డిజిటలైజేషన్ చేయడం శుభపరిణామమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్​జిల్లా రామడుగు మండల తహసీల్దార్ ఆఫీసులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రైతులకు విశ్రాంతి గది, రక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రెనవేషన్ రూములను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు […]

Read More
గోవధకు పాల్పడొద్దు

గోవధకు పాల్పడొద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని అన్ని గ్రామాల మసీద్ కమిటీ సభ్యులతో ఎస్సై టి.వివేక్ శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి గోవధకు పాల్పడొద్దని సూచించారు. అందరూ కలిసి స్నేహపూర్వకంగా బక్రీద్ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ఎస్సై టి.వివేక్​ కోరారు.

Read More
‘భగీరథా’.. ఏమిటీ వృథా!

‘భగీరథా’.. ఏమిటీ వృథా!

సారథి, రామడుగు: సురక్షితమైన నీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు అక్కడక్కడ అభాసుపాలవుతున్నాయి. కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం వెదిర అనుబంధ గ్రామమైన రాజాజీనగర్ లో భగీరథ పైపులు పగిలి కొద్దిరోజులుగా విలువైన తాగునీరంతా ప్రధాన రహదారిపై వృథాగా పారుతోంది. ఈ విషయమై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు చెబితే కాంట్రాక్టర్ పై నెపం నెట్టుతూ పబ్బం గడుపుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. నీరంతా ఇలా పారుతుండటంతో రాజాజీనగర్ […]

Read More
ప్రభుత్వ భూములను వేలం వేయొద్దు

ప్రభుత్వ భూములను వేలం వేయొద్దు

సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ కరీంనగర్​ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంలో సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశం గొడిశాల తిరుపతిగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల వేలం కోసం తెచ్చిన జీవోనం.13ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల […]

Read More
నాయీబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

నాయీబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సారథి, రామడుగు: వెంకటేశ్వర నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రామడుగు గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. రామడుగు మండలాధ్యక్షుడిగా సముద్రాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సముద్రాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల నారాయణ, కోశాధికారి సముద్రాల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరిస్తూ సంఘ అభ్యున్నతికి పాటుపడుతామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More