న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉన్నదని ఏ శక్తి దాన్ని కాపాడలేదని ఆప్ అధికార ప్రతినిధి రాఘవ చాదా విమర్శించారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భారతీయజనతాపార్టీ, కాంగ్రెస్ అధికారం కోసం కుట్రలు పన్నుతున్నాయని, ఈ రెండు పార్టీలకు ప్రజలపై ప్రేమలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఇక భవిష్యత్తులో దేశాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదని అన్నారు. పార్టీకి యువత అవసరం ఉందని, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా చర్యలు అవసరం అని […]