ఢిల్లీ: రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఉద్వేగభరిత ట్వీట్ చేశారు. ప్రేమ, సహనం వంటి ఉత్తమ గుణాలను సోదరుడు రాహుల్‌గాంధీ నుంచే తాను నేర్చుకున్నారని పేర్కొన్నారు. రాహుల్ లాంటి సోదరుడు దొరకడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. రాఖీ పండుగ సందర్భంగా దేశప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు.
సారథి న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సోమవారం ఇంంటింటా వేడుకగా జరిగింది. అక్కాచెల్లెళ్లు.. తమ తమ్ముళ్లు, అన్నలకు రాఖీలు కట్టి దీవించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు ఆయన సోదరి రాఖీ కట్టారు. తన సోదరి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత, ప్రభుత్వ విప్ గొంగడి సునిత, టీఆర్ఎస్ నాయకురాలు గుండు సుధారాణి తదితరులు కలిసి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల […]