Breaking News

యాక్సిడెంట్

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకటరంగయ్యగా గుర్తించారు.

Read More
పవన్​బర్త్​డే వేళ.. ఊహించని విషాదం

పవన్ ​బర్త్ ​డే వేళ.. ఊహించని విషాదం

సారథి న్యూస్, హైదరాబాద్: ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్​బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కలలగన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ ఈసారి పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం శాంతిపురం వద్ద కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు స్పాట్లోనే మృత్యువాతపడ్డారు. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మరణించిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండడంతో […]

Read More
గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​బస్సు

గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​ బస్సు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్​ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్​పరారీలో ఉన్నారు.

Read More