Breaking News

ములుగు

పెళ్లి ట్రాక్టర్ బోల్తా

పెళ్లి ట్రాక్టర్ బోల్తా

సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం రాచపల్లి క్రాస్ రోడ్ వద్ద పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం సాయంత్రం బర్లగూడెం పంచాయతీలోని ఒంటిమామిడిలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి ఛత్తీస్ గఢ్ బయలుదేరిన పెళ్లి ట్రాక్టర్ రాచపల్లి వద్ద ట్రాలీ లింక్ ఊడిపోవడంతో బోల్తాపడింది. ట్రాక్టర్ లో 30 మందికి పైగా ఉన్నారు. వీరంతా ఛత్తీస్ గఢ్ లోని నాంపల్లి […]

Read More
లాక్​ డౌన్​ వేళ బయటికొస్తే కేసులే

లాక్​ డౌన్​ వేళ బయటికొస్తే కేసులే

సారథి, ములుగు: కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్నందున ప్రభుత్వం జారీచేసిన లాక్ డౌన్ ఉత్తర్వులను ప్రజలంతా విధిగా పాటించాలని ములుగు ఏఎస్పీ సాయిచైతన్య కోరారు. నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా బయట తిరిగే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన ములుగు మండలం మదనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై కేసునమోదు చేశామని, అంతేకాకుండా కొవిడ్ నిబంధనలు పాటించకుండా, సామాజిక దూరం పాటించకుండా కిరాణ సరుకులు అమ్మిన నవీన్ రెడ్డిపై […]

Read More
భక్తి టీవీ పంచాంగం ఆవిష్కరణ

భక్తి టీవీ పంచాంగం ఆవిష్కరణ

సారథి, ములుగు: ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ఆలిండియా మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క ఎన్ టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ పంచాంగం బుక్ ఆవిష్కరించారు. భక్తిటీవీ మున్ముందు మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్​ రిపోర్టర్ అరుణ్ కుమార్, ములుగు రిపోర్టర్ సంపత్, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లాల కుమారస్వామి. కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు బానోత్ చందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
కరోనాను తరిమికొడదాం

కరోనాను తరిమికొడదాం

సారథి, ములుగు: కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. శుక్రవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలుపల శానిటైజర్ హ్యాండ్ వాష్ ను ఏర్పాటుచేశారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలకు కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించారు. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలని చూచించారు. ఆఫీసులో మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, ఆఫీసు […]

Read More
మాస్క్ లేకుంటే రూ.1000 ఫైన్​

మాస్క్ లేకుంటే రూ.1000 ఫైన్​

సారథి, ములుగు: తెలంగాణలో మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా తప్పదని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్.కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్​నిబంధన ఉత్తర్వులను వివరించారు. కరోనా నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని, తరచూ శానిటైజర్ ఉపయోగించాలని కలెక్టర్​సూచించారు.

Read More
ఫిర్యాదులపై తక్షణం స్పందించండి

పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్

సారథి, ములుగు: జిల్లా పోలీస్ కార్యాలయంలో ములుగు ఏఎస్పీ పి.సాయిచైతన్య నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ఇతరుల మృతికి కారణమైతే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని, కావునా ప్రజలు ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రోడ్డు నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను తగ్గించుకోవాలని, పారదర్శకంగా దర్యాప్తు చేసి నేరస్తులకు […]

Read More
పోడు భూములను లాక్కుంటే ఊరుకోం..

పోడు భూములను లాక్కుంటే ఊరుకోం..

సారథి, ములుగు: ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నిస్తుందన్నారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ వారిని […]

Read More
కష్టకాలంలో రైతులను ఆదుకుంటాం

కష్టకాలంలో రైతులను ఆదుకుంటాం

సారథి, ములుగు: ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు తాము పండించిన పంటను అమ్మడంలో ఇబ్బందిపడకూడదని ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్వోఎఫ్ఆర్ లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ములుగు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. […]

Read More