సారథిన్యూస్, సత్తుపల్లి: ప్రజలంతా మట్టిగణపతినే పూజించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.