సారథి, మానవపాడు(గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు బుధవారం ప్రారంభించారు. పేదలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని కోరారు. సర్కారు దవాఖానల్లో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోనాకు మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శృతిఓఝా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డీఎంహెచ్ వో […]
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కల్వకోల్, కుడికిళ్లలో సబ్ స్టేషన్ల ప్రారంభం సారథి, కొల్లాపూర్: రాష్ట్రంలో వ్యవసాయానికి లోవోల్టేజీ సమస్య అధిగమించేందుకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్, కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న […]
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా ఘణపురం మండల కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న రైతుబజార్, మాంసం, కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ కృష్ణనాయక్, జడ్పీటీసీ సభ్యుడు సామ్యా నాయక్, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఉన్నారు.
వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్న ఘనపూర్, మెదక్ మండలం మంబోజి పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ లో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర […]