సారథి న్యూస్, వికారాబాద్: తాండూరులో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొడంగల్– తాండూరు మధ్య ఉన్న కాగ్నా వంతెన తెగిపోయింది. వరద మధ్యలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జి తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురవడంతో తాండూరు నియోజకర్గంలోని పంట పొలాలు నీటమునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. కోట్ పల్లి ప్రాజెక్టు లోకి ఆరు అడుగుల వరద చేరింది. బుగ్గపూర్ కోట్ పల్లి, నర్సాపూర్ వాగులు ద్వారా […]
సారథి న్యూస్, హైదరాబాద్: వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటిమొన్నటి వరకు భరించలేని ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ మహా నగరవాసులకు కాసింత ఉపశమనం దొరికింది. నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పైకప్పు రేకులు లేచిపోయాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, తార్నాక, బంజారాహిల్స్, హయత్ నగర్, తుర్కయంజాల్, నల్లకుంట, ఎల్బీనగర్, అంబర్పేట, కీసర, మాల్కాజ్గిరి, చంపాపేట, తార్నాక, హబ్సిగూడ, సరూర్నగర్ తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. అలాగే […]