సారథిన్యూస్, మహబూబ్నగర్: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 2,10,420 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 2,52,459 క్యూసెక్కులను దిగవకు వదలుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు కాగా ప్రాజెక్టులో 210.9946 టీఎంసీలుగా నీరు ఉన్నది. మరోవైపు కుడిగట్టు […]