దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కీలకమైన క్వాలిఫయర్-1లో మ్యాచ్‌లో ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0) వెంటవెంటనే ఔటయ్యారు. సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. స్టోయినిస్(65; 46 బంతుల్లో 4×6, […]
న్యూఢిల్లీ: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ యార్కర్ బౌలర్ అని టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలంగా తన మిస్టరీ డెలివరీలతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడన్నాడు. ‘మలింగ అలుపన్నదే లేకుండా బౌలింగ్ చేస్తాడు. అది కూడా బెస్ట్ యార్కర్లతో. అతని డెలివరీ కూడా పెద్దగా అర్థం కాదు. అర్థమైనట్లే ఉంటుంది కానీ ఆడడం చాలాకష్టం. ఇదే అతని బలం. అంతర్జాతీయ క్రికెట్లో ఆ బలాన్ని ఇంకా కొనసాగించడం మరో […]
బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ న్యూఢిల్లీ: టెస్టుల్లో టీమిండియాను నడిపిస్తున్న పేస్ బలగానికి మరో రెండేళ్లు తిరుగులేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. స్వదేశంతో పాటు విదేశంలోనూ వీళ్లకు ఎదురులేదన్నాడు. ‘గత రెండు సీజన్లలో ఇషాంత్(297 వికెట్లు), షమీ(180 వికెట్లు), ఉమేశ్ యాదవ్(144 వికెట్లు), బుమ్రా (68 వికెట్లు) అద్భుతంగా రాణిస్తున్నారు. రాబోయే రెండేళ్లు కూడా వీళ్లకు ఎదురులేదు. ఏ ఇబ్బంది లేకుండా సమష్టిగా రాణించడం వీళ్లకు ఉన్న బలం. ఫిట్నెస్ను కాపాడుకుంటే అదనంగా మరికొన్ని […]
న్యూఢిల్లీ: తన అసాధారణ బౌలింగ్ యాక్షన్ కారణంగా ఎక్కువ రోజులు క్రికెట్ ఆడలేనని చాలా మంది భయపెట్టారని టీమిండియా పేసర్ బుమ్రా అన్నాడు. ఇలాంటి భిన్నమైన శైలితో ఆడేవారిలో తానే చివరి వాడినని, మరెవరూ ఇండియాకు ఆడే చాన్స్ లేదన్నారని చెప్పాడు. ‘నా బౌలింగ్ యాక్షన్‌పై చాలా మందికి సందేహాలు ఉండేవి. అసాధారణ యాక్షన్ తో లాంగ్ టైమ్ టీమిండియాకు ఆడలేదని చాలా మంది హెచ్చరించారు. ఈ శైలిలో శరీరంలో ఇబ్బందులు వస్తాయన్నారు. గాయాలతో ఎక్కువ రోజులు […]