సారథి న్యూస్, రామాయంపేట: సబ్బండవర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి గ్రామంలో వందశాతం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో గురువారం జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ శ్రీనివాస్ తో కలసి చేపపిల్లలను చెరువులో వదిలారు. సోమాజి చెరువులో 73,500 చేపపిల్లలు, బ్రాహ్మండ్ల చెరువులో 93వేల చేప పిల్లలను వదిలినట్లు […]