సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ సినిమాతో పెను దుమారమే రేపుతున్నాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘గడ్డి తింటావా’ సాంగ్ సర్‌ప్రైజ్ చేసింది. ఈ పాటను 17 లక్షల మంది వీక్షించారని ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పాట విడుదలైన రెండు రోజుల్లోనే ఇంత భారీ రెస్పాన్స్ రావడంపై పవన్కళ్యాణ్అభిమానులకు థ్యాంక్స్చెప్పారు.
రాజకీయ జీవితానికి తాత్కాలికంగా గ్యాప్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. తర్వాత ఆయన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘విరూపాక్ష’ సినిమా చెయ్యనున్నారు. అయితే పవన్ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వగానే పండుగ చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడీ వార్త విని కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అదేమంటే […]
అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ ఎప్పుడు థియేటర్ లో ప్రత్యక్షమవుతాడా? అని ఆతృత పడుతున్నారు. అయినా పవన్ కల్యాణ్ సినిమా లేట్ అవుతూనే ఉంది. కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిందన్న విషయం తెలిసిందేగా. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం మూవీ షూటింగులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో జూన్ మొదటి వారంలో షూటింగ్ ల కోసం అన్ని సినిమాలు […]