రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును 10వరకు నిలిపివేయాలి పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రతపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను […]
సారథి న్యూస్, ఖమ్మం: ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, వారి హక్కులను పరిరక్షిస్తామని భారత మానవహక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం గ్రామంలో గురువారం మానవహక్కుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గిరిజనలకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారి ఇండ్లను పరిశీలించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.