మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ప్రయోజనాలు పట్టవని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం కేంద్రానికి సహకారం అందిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు మీల్లింగ్ ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు సివిల్ సప్లై శాఖ కేంద్రానికి లేఖ రాసినా కూడా […]
సామాజిక సారథి, శ్రీరంగపూర్: ప్రజావసరాలకోసం అంబులెన్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శ్రీరంగపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వం గురువారం నూతన అంబులెన్స్ ను కేటాయించగా, అంబులెన్స్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ వారి అవసరం కోసం అంబులెన్స్ ను ఉపయోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, అలంపూర్: అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అలంపూర్ఎమ్మెల్యే వీఎం అబ్రహాం, నాయకులు కిషోర్‌కుమార్, అలంపూర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.