సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయ్యింది. బంధువులే ఆమెను కిడ్నాప్ చేశారని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిపాలెనికి చెందిన అశోక్‌రెడ్డి, పూజిత ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏపీలోని ఓ దేవాలయంలో వారు వివాహం చేసుకున్నారు. అనంతరం బూర్గంపాడు ఠాణాకి వెళ్లి తమ పెళ్లి విషయం చెప్పారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి […]