Breaking News

దేవరకద్ర

మార్కెట్​కమిటీ చైర్​పర్సన్​గా సుగుణ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్​పర్సన్​గా కొండా సుగుణ నియమితులయ్యారు. శుక్రవారం ఆమె దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్​ ఫంక్షన్​హాల్​లో ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్​గౌడ్​, ఎస్​.నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Read More
వైభవంగా బోనాల వేడుకలు

వైభవంగా బోనాల వేడుకలు

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో మంగళవారం గ్రామ దేవత పోచమ్మ బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళలు బోనం కుండలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానం వద్దకు తరలొచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించారు. వేడుకల సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పరిసరాలను మామిడి తోరణాలు, వేపాకుల మండలతో ముస్తాబు చేశారు.

Read More
శతాధిక వృద్ధుడు మృతి

శతాధిక వృద్ధుడు మృతి

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆదివారం ఓ శతాధిక వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుడైన కొండాపురం హన్మిరెడ్డి(103) 1917 లో జన్మించాడు. అయితే ఎప్పుడు చలాకీగా ఉండే హన్మిరెడ్డి తన పని తాను చేసుకుంటూ హాయిగా ఉండేవాడు. ఈనెల 9న ప్రమాదవశాత్తు కాలు జారిపడి అస్వస్థతకు గురయ్యాడు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో మృతిచెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.

Read More
కోయిల్​సాగర్​ ఐదుగేట్ల ఎత్తివేత

కోయిల్​సాగర్​ ఐదుగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు గురువారం భారీ వరద నీరు వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు ఐదు షట్టర్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో బుధవారం రాత్రి భారీవర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు వచ్చే కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి నీటి ఉధృతి బాగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. ముందస్తు చర్యగా అధికారులు ప్రాజెక్టు […]

Read More
ఘనంగా వినాయకుడి నిమజ్జనం

ఘనంగా వినాయకుడి నిమజ్జనం

సారథి న్యూస్, దేవరకద్ర: దేవరకద్ర వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూతో పాటు కండువా, స్వామివారి పంచెలకు వేలంపాట నిర్వహించారు. చాలామంది భక్తులు వేలంపాటలో పాల్గొని వాటిని కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయకుడిని దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండరపల్లి వాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, అర్చనలు […]

Read More
సీసీ కెమెరాలు ప్రారంభం

సీసీ కెమెరాలు ప్రారంభం

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామంలో ప్రముఖ సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ తన సొంత ఖర్చు రూ.15లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ శ్రీధర్​ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ, సర్పంచ్ స్వప్న కిషన్ రావు, ఎస్సై భగవంతురెడ్డి, గోపాల్, హరిగోపాల్, బాబు, జానీ తదితరులు పాల్గొన్నారు.

Read More
ముత్యాలజల్లు కురిసే

ముత్యాల జల్లు కురిసే..

ఈ ఫొటోలు చూస్తుంటే.. ముత్యాల జల్లు కురిసే.. పాట గుర్తుకొస్తోంది కదూ.. అదే మరి వర్షం కురిసినప్పుడు చినుకులు అలాగే కొద్దిసేపు ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇలాంటి దృశ్యమే మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రకృతి ప్రేమికులను అలరించింది. చినుకులు అచ్చం ముత్యల్లా మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకున్నాయి. :: ఫొటోలుఎండీ మక్తధీర్, దేవరకద్ర

Read More
ఊరచెరువులోకి చేపపిల్లలు

ఊరచెరువులోకి చేపపిల్లలు

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని ఖతల్ ఖాన్ చెరువు, ఊరచెరువులో బుధవారం చేపపిల్లలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వదిలారు. అనంతరం చెత్తసేకరణ వాహనాలను ప్రారంభించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Read More