సూర్యాపేట జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట జిల్లానాగారం మండలం ఫణిగిరి స్టేజీ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నర్రా సందీప్, జేరిపోతుల హరీశ్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.