అహ్మదాబాద్: ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైనా ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ చేసిన 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్; 5×4, 3×6), ఇషాన్ కిషన్ (32 […]
హార్దిక్ పాండ్యా వీరోచిత బ్యాటింగ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్ సిడ్నీ: పొట్టి క్రికెట్లో టీమిండియా గట్టి సవాల్‌ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా ఒక మ్యాచ్మిగిలి ఉండగానే సీరిస్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2–0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ […]
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీ: టీ20లకు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ ఉండడం సరైందేనని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ‘స్పెషలిస్ట్ కోచ్‌తో చాలా ప్రయోజనాలు ఉంటాయి. కోచ్‌గా సక్సెస్ కావాలంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలన్నది సరైన వాదన కాదు. టీ20ల్లో కోచ్ చేయాల్సింది.. ప్లేయర్లలో సానుకూల ధోరణిని పెంచడం. భారీ షాట్స్ ఆడేలా, లక్ష్యాలు చేరుకునేలా […]
ఐసీసీ క్రికెట్ కమిటీ న్యూఢిల్లీ: బంతి మెరుపును పెంచేందుకు లాలాజలం (సెలైవా) వాడడాన్ని ఐసీసీ క్రికెట్ కమిటీ నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉండడంతో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మనం అసాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నాం. క్రికెట్‌ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు మా కమిటీ కొన్ని మధ్యంతర ప్రతిపాదనలు చేసింది. వీటిని ఐసీసీ ముందు ఉంచుతాం. బంతి మెరుపు కోసం ఇక నుంచి లాలాజలాన్ని వాడొద్దు. అయితే […]