కలకత్తా: బంతిపై ఉమ్మిని రుద్దకుండా నిషేధం విధించినా.. తాను మాత్రం రివర్స్ స్వింగ్ రాబడతానని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కాకపోతే బంతి రంగు మారకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాడు. ‘ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చిన్నతనం నుంచి పేసర్లు బంతిపై ఉమ్మి రుద్దేందుకు అలవాటుపడ్డారు. ఇది ఆటలో భాగమైపోయింది. ఒకవేళ నీవు ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే బంతి రంగు మెరుగపర్చేందుకు ఉమ్మిని రుద్దాల్సిందే. అయితే ఆ బంతి రంగు పోకుండా కాపాడగలిగితే కచ్చితంగా రివర్స్ […]
న్యూఢిల్లీ: బంతి రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భిన్నంగా స్పందించాడు. ఉమ్మి కాకపోతే మరో ప్రత్యామ్నాయం చూపాలని కోరాడు. బంతిని మెరుగుపర్చకపోతే బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. ‘వికెట్ తీసిన తర్వాత కౌలిగింతలు, షేక్ హ్యాండ్స్ వద్దంటున్నారు. వ్యక్తిగతంగా నాకూ ఇవి ఇష్టం ఉండదు. కానీ ఉమ్మి విషయంలోనే అసలు సమస్య. ఉమ్మిని ఉపయోగించకుండా బంతిని ఎలా మెరుగుపర్చాలి. దీనికోసం మరో దానిని చూపించాల్సిందే. ఎందుకంటే బంతిని కాపాడుకోకపోతే […]
న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్ యుగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను మించిన వాళ్లు లేరని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. భారత క్రికెట్ జట్టు విజయాలలో ఈ ఇద్దరి పాత్ర వెలకట్టలేనిదన్నాడు. అందుకే సమకాలిన క్రికెట్ లో ఈ తరం వాళ్లదేనని స్పష్టం చేశాడు. ‘మేం ఆడే రోజుల్లో ద్రవిడ్, దాదా అద్భుతంగా ఆడేవాళ్లు. కేవలం క్రికెటింగ్ షాట్లతోనే పరుగులు సాధించేవారు. సాంకేతికంగా కూడా ఈ ఇద్దరు చాలా […]
న్యూఢిల్లీ: మాజీ సారథి ధోనీ వల్లే తాను అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దాదాపు ఆరు, ఏడు ఏళ్ల పాటు మహీ తనపై దృష్టిపెట్టడంతోనే ఇదంతా సాధ్యమైందన్నాడు. రాత్రికిరాత్రే తాను కెప్టెన్ కాలేదని స్పష్టం చేశాడు. ‘ఓ క్రికెటర్‌గా నాకంటూ ఓ ఆటతీరు ఉంటుంది. కానీ కెప్టెన్‌గా ఎలా? అందుకే ధోనీ నన్ను చాలా కాలం పాటు దగ్గరి నుంచి గమనించాడు. మ్యాచ్‌లో నా బాధ్యతల నిర్వహణ, ఆటతీరును, సహచరులతో ప్రవర్తన.. […]
లండన్: ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రూ.196 కోట్ల ఆదాయంతో 66వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే 34 స్థానాలు పైకి ఎగబాకాడు. ఈసారి కూడా భారత్ నుంచి విరాట్ మినహా మరెవరికీ చోటు దక్కలేదు. ఇక స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. రూ.801 కోట్లతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టెన్నిస్ ప్లేయర్‌కు టాప్ ప్లేస్ దక్కడం ఇదే తొలిసారి. సాకర్ […]
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని బౌలర్‌గా ఎదిగిన టీమిండియా పేసర్ భువనేశ్వర్.. టెస్ట్‌ల్లోకి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్లో ఆడుతున్న వారంతా బాగా రాణిస్తున్నారని చెప్పాడు. దీంతో తన పునరాగమనం మరింత కష్టమవుతుందన్నాడు. అయినా కచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ‘టెస్ట్‌ల్లో ఆడాలని బలంగా కోరుకుంటున్నా. కానీ పునరాగమనం సులువు కాదని తెలుసు. అయినా ప్రయత్నించడంలో తప్పు లేదని నా అభిప్రాయం. ఇప్పుడున్న పేసర్ల చాలా బాగా ఆడుతున్నారు. వాళ్లను దాటి చోటు […]
టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏదో ఓ దశలో ఐపీఎల్ జరిగితేనే మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ కోరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించినా ఫర్వాలేదని కుంబ్లే అన్నాడు. ఈ ఆలోచన తప్పు కాదన్నాడు. ‘ఐపీఎల్ జరగాలని నేను బలంగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ షెడ్యూల్‌ను సమీక్షిస్తే ఈ ఏడాది లీగ్ కు సమయం లభిస్తుందని భావిస్తున్నా. ఒకవేళ ప్రేక్షకులకు అనుమతి లేకుంటే.. నాలుగు […]
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్. ధోనీ రిటైర్మెంట్ విషయం మరోసారి చర్చకు వస్తున్న వేళ.. భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌లో ఎంతో సాధించిన మహీకి.. ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసన్నాడు. ఇందులో ఎవరూ బలవంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. తన వీడ్కోలు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కును అతను సంపాదించుకున్నాడని స్పష్టం చేశాడు. ‘ధోనీ అద్భుతమైన క్రికెటర్. అతని మేధస్సు, ప్రశాంతత, పవర్, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం […]