సారథి న్యూస్, హుస్నాబాద్: అక్రమ అరెస్టులతో ఉద్యమన్ని ఆపలేరని బీజేపీ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ఆయన విలేరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులు ప్రజలను కంటతడి పెట్టిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయా బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు వేణుగోపాలరావు, మోహన్ నాయక్, నరేష్, అజయ్, కృష్ణ, కార్తీక్, సాగర్, సంపత్, సుధాకర్, కళ్యాణ్, శ్రీనాథ్, సాంబరాజు పాల్గొన్నారు
సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : తిమ్మాజిపేట్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు, ఇతర వీర జవాన్లకు ఘన నివాళలర్పించారు.స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాగడల ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లను ఈ దేశం […]