Breaking News

జోగుళాంబ

అమ్మవారికి పుష్కర స్నానం

అమ్మవారికి పుష్కర స్నానం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్​ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. […]

Read More
తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం

తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం

సారథి న్యూస్​, తుంగభద్ర పుష్కరాలు: తుంగభద్ర నది పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. రాజోలిలోని పుల్లూరు, అయిజ మండలం వేణిసోంపురం ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ స్నానాలు చేసిన అనంతరం అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. :: ఫొటోలు, సాధిక్, మానవపాడు

Read More
పుష్కరాలను సక్సెస్​చేయండి

పుష్కరాలను సక్సెస్​ చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో తుంగభద్ర నది పుష్కరాలను సక్సెస్​ చేయాలని అలంపూర్​ ఎమ్మెల్యే వీఎం అబ్రహం సూచించారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్​లో కలెక్టర్ ​శృతిఓజా, ఎస్పీ రంజన్​రతన్​ కుమార్​తో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్స్ వద్ద ఐమాక్స్ లైటింగ్ సిస్టం, మొబైల్ టాయిలెట్స్, ఆర్​డబ్ల్యూఎస్​శాఖ వారి ఆధ్వర్యంలో శుద్ధమైన నీటిని ఏర్పాటు చేయాలని, బ్లీచింగ్​ పౌడర్​ చల్లాలని, అవసరమైన చోట వలంటీర్లను నియమించాలని […]

Read More
జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి

జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి

సారథి న్యూస్, అలంపూర్: అలంపూర్ ​జోగుళాంబ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అలంపూర్​ఎమ్మెల్యే వీఎం అబ్రహాం, నాయకులు కిషోర్​కుమార్, అలంపూర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

Read More
జోగుళాంబకు జడ్పీ చైర్​పర్సన్​పూజలు

జోగుళాంబకు జడ్పీ చైర్​పర్సన్ ​పూజలు

సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు, బాల బ్రహ్మేశ్వర దీవెనలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికిపై ఉండాలని కోరుతూ జడ్పీ చైర్​పర్సన్​సరిత అమ్మవారికి పట్టువస్త్రాలు అలంకరించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మన్న, వడేపల్లి జడ్పీటీసీ కాశపోగు రాజు, రాజోలి జడ్పీటీసీ సుగుణమ్మ, శ్రీనాథ్ రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మునగాల నరసింహులు, […]

Read More
అలంపూర్ లో కరోనా పాజిటివ్

అలంపూర్ లో కరోనా పాజిటివ్

సారథి న్యూస్​, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ డ్రైవర్ కు కరోనా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి, మున్సిపల్ చైర్మన్ మదన్​మోహన్​స్పష్టంచేశారు. ఇటీవల అతడు జ్వరంతో బాధపడుతుండగా, వైద్యపరీక్షలు చేయించగా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఆ ఇంటిలో 12 మంది ఉండడంతో కరోనా ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Read More
తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించండి

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించండి

సారథి న్యూస్​, అలంపూర్​: నవంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ జిల్లా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి దిండిగల్​ ఆనంద్ శర్మ ఎమ్మెల్యే అబ్రహంకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించేది ఒక […]

Read More
13 నుంచి అలంపూర్‌ ఆలయాల మూసివేత

13 నుంచి అలంపూర్‌ ఆలయాల మూసివేత

సారథి న్యూస్​, అలంపూర్‌: ఈనెల 13 నుంచి 19 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను మూసివేస్తున్నట్లు అలంపూర్‌ ఆలయాల ఈవో ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. అలంపూర్‌లో దర్గా ఉర్సు సందర్భంగా వారం రోజుల పాటు అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటే కొవిడ్‌-19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఆలయాల్లో అర్చకులు నిత్యపూజలు నిర్వహించి మూసివేస్తారని, ఉభయ ఆలయాల దర్శనాలకు భక్తులకు అనుమతి లేదన్నారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించి […]

Read More