Breaking News

జలకళ

బండరపల్లి చెక్​డ్యాంకు జలకళ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్​పల్లి చెక్​డ్యాం అలుగు పారుతోంది. బండర్​పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్​రావు చొరవతో చెక్​డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్​డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Read More