సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీపీ మాలోతు లక్ష్మి భీలునాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అక్కన్నపేట మండలంలోని చౌటపల్లితో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులు మాస్కులు ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గద్దల రమేశ్, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కోరారు. గురువారం అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అడవులు అంతరించి పోవడంతో పొల్యూషన్ పెరుగుతుందన్నారు. ఎంపీపీ మాలోతు లక్ష్మి మాట్లాడుతూ..బర్త్ డే, పెండ్లి రోజు తీపిగుర్తులకు చిహ్నాంగా ముఖ్యమైన రోజుల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, జడ్పీటీసీ మంగ, స్పెషలాఫీసర్ నర్సింగరావు, ఎంపీవో సుమాన్, ఏపీవో ప్రభాకర్, ఎస్సై కొత్తపల్లి రవి, సర్పంచ్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబానికి చౌటపల్లి గ్రామఅభివృద్ధి కమిటీ రూ.5000 ఆర్థికసాయం అందించింది. కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి రాజయ్య హఠాత్తుగా మృతిచెందడంతో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దీంతో శనివారం సర్పంచ్ గద్దల రమేశ్ బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పోశెట్టి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఐలయ్య, వెంకటయ్య, మల్లేశం, రమేష్, త్రిమూర్తి, శంకర్, సురేందర్, రాజ్ కుమార్, బాలయ్య, […]