అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా చదువులు ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్ధమైన రక్షణ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ ఐడీ కార్డులు సీఎం కేసీఆర్‌కు కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదనలు సామాజికసారథి, హైదరాబాద్: అభాగ్యులను చేరదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుత విధానం తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అనాథలను అక్కున చేర్చుకుని వారికి ఉచితంగా విద్యను అందించాలని సంకల్పించింది. వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ను ఏర్పాటుచేసి ప్రత్యేక […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు నాలుగు విడతల్లో రూ.75వేల ఆర్థికసాయం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు.
సారథి న్యూస్, ఎల్బీ నగర్: సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు ప్రత్యేక పథకాలు అమలుచేస్తున్నట్లు ప్రకటించడం సంతోషకరంగా ఉందని చేనేతకార్మిక సంఘం ఎల్బీ నగర్ అధ్యక్షుడు చెర్కుస్వామి నేత అన్నారు. శనివారం ఎల్బీ నగర్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈనెల 19న ‘చేనేతకు చేయూత’పథకంతో చేనేతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా జీవోను తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు. దీంతో చేనేతల ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు లబ్ధిపొందేలా రూపొందించారని […]
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా సమయంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ సీఎస్ఐ చర్చి కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హాజరయ్యారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.