Breaking News

చిన్నశంకరంపేట

మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామశివారులో నూతనంగా ఏర్పాటుకానున్న ఓ కంపెనీకి ప్రభుత్వ అసైన్​మెంట్​ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భారతీయ కిసాన్​మోర్చా మెదక్​ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. కామారం గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి రాత్రికిరాత్రే మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులతో పాటు కంపెనీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Read More
15వరకు ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్ల గడువు

15 వరకు ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్ల గడువు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఓపెన్ స్కూళ్ల అడ్మిషన్ల గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉందని, బడి మధ్యలో చదువును ఆపివేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్​ స్కూల్​ జిల్లా కోఆర్డినేటర్​ వెంకటస్వామి కోరారు. శనివారం వారు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో యాదగిరి, జడ్పీ హైస్కూలు చిన్నశంకరంపేట కోఆర్డినేటర్ అర్చన, రాములు, ఉపాధ్యాయులు శ్రీకాంత్, రాజ్ కుమార్​, నాగరాజు, సరిత పాల్గొన్నారు.

Read More
విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలి

విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: విద్యార్థులు వినయం, విజ్ఞానం, ఆరోగ్యం వంటి మూడు సూత్రాలను పాటించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయలక్ష్మి సూచించారు. శనివారం ఆమె స్థానిక ఎస్టీ హాస్టల్ ను తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారం అందజేయడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More
పంట మార్పిడితో రైతులకు మేలు

పంట మార్పిడితో రైతులకు మేలు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: రైతులు ఒకే రకం పంట పండించకుండా పంట మార్పిడి నేర్చుకోవాలని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం గవ్వలపల్లిలో రైతువేదికలో అపరాలు, నూనెగింజల పంటలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీచేశారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించడంతో పాటు, మొట్టమొదటి […]

Read More
జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: స్కూళ్లు పున:ప్రారంభమవుతున్ననేపథ్యంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చిన్నశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిరెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో హైస్కూలు హెడ్ మాస్టర్లు, సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలు నడపాలని తహసీల్దార్​ రాజేశ్వర్​రావు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎంపీడీవో గణేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు నష్టపోయిన రోజులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులంతా కృషిచేయాలని ఎంఈవో […]

Read More
ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’

ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మండలంలోని అభివృద్ధి పనులపై డీఆర్డీవో శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తంచేశారు. శుక్రవారం మండలంలోని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంతో పాటు ఉపాధి హామీ, ఐకేపీ ఆఫీసులను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సముదాయ కార్యాలయం ముందున్న మొక్కలకు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మితో కలిసి నీళ్లు పట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం హరితహారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ఫ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీడీవో గణేష్ రెడ్డి […]

Read More
తహసీ​ల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా

తహసీ​ల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఒకే సర్వే నంబర్​లో కొంత భూమిని అసైన్​మెంట్​గా చూపించడంతో శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది రైతులు తహసీల్దార్​ను అడ్డుకున్నారు. సర్వేనం.270లో 490 ఎకరాల భూమిలో అగ్రవర్గానికి చెందిన ఒకే కుటుంబసభ్యులకు 10 ఎకరాలను పట్టా భూమిగా మార్చడం ఏమిటని నిలదీశారు. చివరికి అధికారులు రైతులను […]

Read More
టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ల ఆవిష్కరణ

టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ల ఆవిష్కరణ

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ నియోజకవర్గ టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ ను మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంగళవారం కొంపల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. టీఆర్​ఎస్​వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్​ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్​ గౌడ్​, నరేష్, లింగం రాజ్, మల్లేష్, దుర్గగౌడ్, శ్రవణ్ గౌడ్, ముస్తఫా, సాయికిరణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Read More