ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా సోకిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జయబచ్చన్‌కు తప్ప వారింట్లోని వారందరికీ కరోనా సోకింది. కాగా ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇటీవల వీరిని కలిసిన బాలీవుడ్ నటుల్లో ప్రస్తుతం […]
సారథి న్యూస్, రామాయంపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ నిజాంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం మృతిచెందారు. మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రంగ పోచయ్య(63) రెండు రోజుల క్రితం మామిడి పండ్లు తెంచే క్రమంలో చెట్టు పైనుంచి కాలుజారి కింద పడి.. చికిత్స పొందుతూ చనిపోయాడు. చల్మేడ గ్రామానికి చెందిన రాగుల పర్శరాములు(36) గత బుధవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్సపొందుతూ పరిస్థితి […]