సారథి, రామడుగు: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా కన్వీనర్, గోపాల్ రావు పేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న శుక్రవారం పాత్రికేయులకు సరుకులు, బియ్యం, పప్పు తదితర వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం వార్త సేకరణ చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పాత్రికేయులు గంటే భాస్కర్, ఎజ్రా మల్లేశం, రామస్వామి, రజాక్, రమేష్, బొడిగే శ్రీను, మహేష్ పాల్గొన్నారు.
సారథి, రామడుగు: మానవత్వం ఇంకా బతికే ఉందన్నదానికి ఈ సాయమే నిదర్శనం. కరోనా బాధితురాలిని అద్దె ఇంట్లో నుంచి గెంటివేస్తే వారికి ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు ఓ మంచి మనిషి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో కరోనా బారినపడిన కుటుంబానికి అద్దెకు ఇచ్చిన యజమాని తమ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వెంటనే ఆ కుటుంబానికి సర్పంచ్ సత్యప్రసన్న చేయూత ఇచ్చారు. రెండ్ల మల్లేశం ఆ కుటుంబ పరిస్థితిని వారికి తీసుకుపోవడంతో నిర్మాణదశలో ఉన్న […]
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల రామడుగు మండలం గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న ఉదారత చాటుకున్నారు. లాక్ డౌన్ తో అంబులెన్స్ లు, ఇతర వాహనాలు దొరక్క హాస్పిటల్ కు వెళ్లలేని వారి కోసం స్వయంగా తన సొంత కారును గురువారం నుంచి అందుబాటులో ఉంచారు. పెట్రోల్, డ్రైవర్ ను సంబంధిత వ్యక్తులే చూసుకోవాలని సర్పంచ్ సత్యప్రసన్న సూచించారు. […]