Breaking News

గీతకార్మికులు

మోకే ఉరితాడైంది

సారథిన్యూస్​, గోదావరిఖని: కల్లు తీసేందుకు వెళ్లిన ఓ గీతకార్మికుడికి.. మోకు మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామంలో విషాదం నింపింది. గుర్రంపల్లికి చెందిన మామిడి రాజు ప్రతిరోజు మాదిరిగానే కల్లు తీసేందుకు మోకు సాయంతో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు.. మెడకు చుట్టుకున్నది. దీంతో ఉపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి గీతకార్మికులు మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దించారు.

Read More