న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లుగా క్రికెట్లో బంధుప్రీతి లేదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. దిగ్గజ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించాడు. నైపుణ్యం లేకుండానే అర్జున్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారన్న వాదనను తోసిపుచ్చాడు. అదే జరిగితే అర్జున్, రోహన్ గవాస్కర్ టీమిండియాలో మంచి స్థితిలో ఉండేవారన్నాడు. టాలెంట్ లేకుండా క్రికెట్లో రాణించడం కష్టమన్నాడు. ‘క్రికెట్లో బంధుప్రీతి అనే ప్రస్తావనే లేదు. అలా ఉంటే […]
న్యూఢిల్లీ: వయసు సంబంధించిన అనారోగ్య సమస్యలతో దేశవాళీ క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (77) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నాడు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 750 వికెట్లు తీశారు. హర్యానా, నార్త్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆట పరంగా అత్యుత్తమ స్పిన్నరే అయినా.. బిషన్ సింగ్ బేడీ నీడలో ఆయనకు టీమిండియాకు ఆడే అవకాశం దక్కలేదు. బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారంతో పాటు అనేక అవార్డులను సొంతం […]
ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కలకత్తా: ఓవైపు చదువు.. మరోవైపు క్రికెట్.. ఈ రెండింటిలో ఏదీ తీసుకోవాలో తెలియక చాలా సతమతమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆ సమయంలో క్రికెట్‌తో జూదం ఆడానని చెప్పాడు. ‘17 ఏళ్ల వయసులో నాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత టీమిండియా నుంచి పిలుపువచ్చింది. అప్పటివరకు కెరీర్ ఎలా సాగుతుందోనని సందేహాలు ఉండేది. అభద్రతాభావం ఎప్పుడూ […]
కోల్కతా: ఇండియా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు చున్నీ గోస్వామి గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. గత కొన్నేళ్లుగా మధుమేహం, నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కలకత్తాలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. 1956–64 మధ్య ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన గోస్వామి 50 మ్యాచ్ లూ ఆడాడు. 1962 ఆసియా క్రీడల్లో భారత్ ను విజేతగా నిలపడంతో గోస్వామి పేరు మార్మోగిపోయింది. ఫుట్ బాల్ తో పాటు క్రికెట్ పై మక్కువ […]
ఫ్యూచర్ ఎట్లుండాలి? న్యూఢిల్లీ: క్రికెట్ తిరిగి మొదలుపెట్టాకా.. భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండాలనే అంశాలపై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, ఇండియా–ఏ, జూనియర్ టీమ్ కోచ్ ల మధ్య ఆన్ లైన్ లో చర్చ జరిగింది. తమ ఆలోచనలు, అభిప్రాయాలను ఇందులో పంచుకున్నారు. జూనియర్ టీమ్ లకు సంబంధించిన కోచ్ లు రవిశాస్త్రి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఆన్ రైన్ చర్చకు రూపకల్పన చేశాడు. […]