Breaking News

కౌన్సెలింగ్

కౌన్సెలింగ్ భౌతికంగా నిర్వహించాలి

కౌన్సెలింగ్ భౌతికంగా నిర్వహించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను భౌతికంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు  మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం   జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు పర్వతరెడ్డి, మురళి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Read More

గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్​లో చేరేందుకు ఇంటర్మీడియట్​ సెకండియర్​ స్టూడెంట్స్​కు TGUGCET(2020-21) నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్​లైన్​లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కింది తేదీల్లో కౌన్సెలింగ్​కు హాజరుకావాలని గురుకుల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు. కౌన్సెలింగ్​ తేదీలు–బీఎస్సీ(ఎంపీసీ), జూన్​ 25, 26 తేదీలు..–బీఎస్సీ(ఎంఎస్​సీఎస్​)/బీఏ(హెచ్​ఈపీఏ), బీకామ్​(కంప్యూటర్​), జూన్​ 27, 28,29 తేదీలు.–బీఎస్సీ(బీజెడ్​సీ), బీఎస్సీ(ఎంపీసీఎస్​), బీఎస్సీ(ఎన్​డీజడ్​సీ), […]

Read More