హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణమంతా చల్లబడి చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు గజగజవణికిపోతున్నారు. శని, ఆదివారాల్లో కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోనూ శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు, దక్షిణ కోస్తాలో ఉరుములు, […]