Breaking News

కొవిడ్ 19

పేదలకు సరుకులు పంపిణీ

పేదలకు సరుకులు పంపిణీ

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో […]

Read More
పారిశుద్ధ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం

పారిశుద్ధ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం

సారథి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీసులో అంగన్ టీచర్లు, ఆయాలకు వివిధ సంస్థలు వితరణగా అందజేసిన శానిటైజర్, ఫేస్ షీల్డ్, మాస్కులను కలెక్టర్ జి.రవి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమై వాతావారణంలో సంభవించే మార్పుల కారణంగా ప్రజలు మలేరియా, డెంగీ వంటి అనారోగ్యాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై మురుగునీరు నిలువకుండా చూడాలని సూచించారు. అనారోగ్యాల బారినపడి అప్పులు తీసుకొచ్చి వైద్యం చేయించుకునే దుస్థితి కలగకుండా ఇంటి […]

Read More
పండ్ల ధరలకు రెక్కలు

పండ్ల ధరలకు రెక్కలు

కరోనా ప్రభావమే కారణం అవసరాన్ని సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు సారథి, రాయికల్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. కొందరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా మరికొందరు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.ఈ సమయంలో వైద్యులు, నిపుణులు పండ్లను అధికంగా తినడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. తద్వారా వైరస్ నశించిపోతుందని చెబుతున్నారు. వ్యాధి బారినపడిన పేదలు త్వరగా కోలుకోవాలనే తపనతో పండ్లను కొని తిందామంటే వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితుల్లో పండ్లను కొనుగోలుచేసి తినే పరిస్థితి […]

Read More
కరోనాతో యువకుడి మృతి

కరోనాతో యువకుడి మృతి

సారథి, పెద్దశంకరంపేట: కరోనాతో యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని జంబికుంట గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యువకుడు మంగళవారం ఉదయం స్థానిక  ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలుగు పాజిటివ్ కేసులు ఒకేరోజు 25 మందికి పరీక్షలు చేయగా అందులో నాలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ […]

Read More
హమాలీలు, కూలీలకు మాస్కులు పంపిణీ

హమాలీలు, కూలీలకు మాస్కులు పంపిణీ

సారథి, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ చిలుక రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, వరి కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ఐదొందల మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నదని, ప్రజలంతా మాస్కులు ధరించి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలి. గ్రామంలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరికివారు తమ […]

Read More