Breaking News

కేటీదొడ్డి

పూరి గుడిసె దగ్ధం.. ఆస్తినష్టం

పూరి గుడిసె దగ్ధం.. ఆస్తినష్టం

కేటీదొడ్డి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుంట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించడంతో రమేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. టీవీ, రెండు క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, సామాన్లు కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.రెండులక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ​సుభాషిణిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు రమేష్​ కోరాడు.

Read More
తెగిన బ్రిడ్జి.. నిలిచిన రవాణా

తెగిన బ్రిడ్జి.. నిలిచిన రవాణా

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని కేటీదొడ్డి మండలం నందిన్నె వద్ద ఉన్న మట్టిరోడ్డు బుధవారం కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. దీంతో వాహనాల‌ రాకపోకలు నిలిచిపోయాయి. కొంతకాలంగా పాత వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. బ్రిడ్జి పక్కన ఉన్న మట్టి రోడ్డు పైనుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వాగులో భారీగా నీళ్లు వచ్చి చేరడంతో ఈ వాగు తెగిపోయింది.

Read More