Breaking News

ఏసీపీ

ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు మాములుగా లేవుగా!

అక్రమాస్తుల కేసులో ఏసీబీ చిక్కిన మల్కాజ్​గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు చూస్తుంటే ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగిపోతుందట. అతడికి ఏకంగా రూ. 100 పైనే ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నరసింహారెడ్డికి ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సమాచారం. మరోవైపు నిన్న జరిపిన సోదాల్లో ఏసీపీ ఇంట్లో 15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్​లో రెండు ఇండ్లు, హఫీజ్​పేట్​లో 3 […]

Read More
మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తులు

సారథి న్యూస్, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఏకకాలంలో హైదరాబాద్​లో ఆరుచోట్ల దాడులు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన ఆయన పలు ల్యాండ్ సెటిల్​మెంట్లు, భూవివాదాల్లో తలదూర్చారనే ఉన్నాయి. తన వాళ్లకు అన్ని పనులు చేసిపెట్టేవారని వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేశారు.

Read More

కులంపేరుతో దాడి

సారథి న్యూస్​, హుస్నాబాద్: గిరిజన మహిళా ఎంపీటీసీని కులంపేరుతో దూషించడమే కాక.. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కపూర్ నాయక్ తండా సర్పంచ్ బానోతు సంతోష్ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కు వినతిపత్రం అందజేశారు. అక్కన్నపేట మండలం గండిపల్లిలో 11న గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీటీసీ బానోత్ ప్రమీలను సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ భర్త మరి కొంత మంది అసభ్య పదజాలంతో దూషించడమే కాగా […]

Read More
శుభదినాల్లో మొక్కలు నాటండి

శుభదినాల్లో మొక్కలు నాటండి

సారథి న్యూస్, హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని హుస్నాబాద్​ ఏసీపీ మహేందర్ అన్నారు. బర్త్​డే, పెండ్లి రోజు, ఇతర శుభదినాల్లో మొక్కలు నాటాలని కోరారు. బుధవారం కోహెడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరించడంతో పర్యావరణం రోజురోజుకు కలుషితమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కార్యక్రమంలో సీఐ రఘు, ఎస్సై రాజుకుమార్, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ప్రాణాలు తీసిన ఈత

సారథి న్యూస్, హుస్నాబాద్: ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో చోటుచేసుకుంది. ఏసీపీ మహేందర్ కథనం.. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పొన్నాల అనిల్ (17), మానకొండూరు మండలం రంగంపేటకు చెందిన నంగునూరు కుమార్(18) బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం కోహడ మండలం శనిగరం ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు వెళ్లి ఊపిరాడక చనిపోయారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.

Read More