సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని అనంతపురం నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేద్దామని జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు చెప్పారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మందులు దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారం చేయకూడదన్నారు. పాతఊరు తిలక్ రోడ్డు, గాంధీబజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని దుకాణాల వద్ద జనం గుమిగూడకుండా దృష్టిపెట్టాలన్నారు. దుకాణాల […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) ఆదివారం జిల్లాలో పర్యటించారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తో కలసి పాజిటివ్ కేసులు వచ్చిన పాతపట్నం ప్రాంతాన్ని పరిశీలించారు. కంటైన్మెంట్ ప్రాంతాలకు వచ్చేందుకు, పోయేందుకు ఒకటే మార్గం ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ కంటైన్ మెంట్ జోన్ […]
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటన్ ను రిలీజ్ చేసింది. కొత్తగా 62 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ఇలా రాష్ట్రంలో 955కు పాజిటివ్ కేసులు చేరాయి. కర్నూలు జిల్లాలో 27, గుంటూరు 11, అనంతపురం నాలుగు, తూర్పు గోదావరి ఆరు, కృష్ణా 14, ప్రకాశం మూడు, నెల్లూరు జిల్లాలో ఒకటి కేసు చొప్పున కొత్తగా పాజిటివ్ […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: రెడ్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని స్పష్టం చేశారు. సాయంత్రం జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటైన్ మెంట్ జోన్లలో డోర్ డెలివరీ సౌకర్యం పెంచాలని సూచించారు. కరోనా నియంత్రణలోజిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు చాలా శ్రమిస్తున్నారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రసూతి, […]
సారథి న్యూస్, విజయవాడ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ సోమవారం ట్విట్టర్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా..’ అని పవన్ ట్వీట్ చేశారు.
సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, విలేకరులకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.