పోలీసు ఇన్ఫార్మర్లకు హెచ్చరికలు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం గ్రామ సమీపంలోని భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై వెలసిన మావోయిస్టు కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం లేఖ వెలువడటంతో ఈలేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులుకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న బొల్లారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాలకు చెందిన వ్యక్తులు మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని పోలీసులు చూపే ప్రలోభాలకు, […]
సారథి, నూగూరు వెంకటాపురం: ఏజెన్సీలో వేలంపాట రాజ్యాంగ విరుద్ధమని, గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి అన్నారు. మంగళవారం ఏఎన్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ ఆశీలు, జంతు వధశాల, కొలగార కాటరుసుం, బందెలదొడ్డి వేలంపాట ఏజెన్సీలో పెసా గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని కోరారు. మేజర్ గ్రామ పంచాయతీ ఈవో పెసా చట్టానికి విరుద్ధంగా వేలంపాట నిర్వహించాలని […]
సారథి న్యూస్, మహబూబాబాద్: జిల్లాలోని పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న అటెండెంట్ పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్విధానంలో పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు పశువుల హాస్పిటల్స్లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులకు షెడ్యూల్ తెగలకు చెందినవారు మాత్రమే అర్హులని, పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లమో […]