సారథి, చొప్పదండి: నియోజకవర్గ అభివృద్ధి కోసం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్నేతలు హితవు పలికారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ సోమిడి శ్రీనివాస్, భక్తు విజయ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ కనుమల్ల రాజశేఖర్ తదితరులు చొప్పదండిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ […]
సారథి, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.5,41,500 సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం […]
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పల్లెప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం కాట్నపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చదనం, పారిశుద్ధ్యం పల్లెప్రగతి ముఖ్య లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికల నిర్మించుకున్నామని చెప్పారు. తల్లిదండ్రుల చనిపోయి అనాథలుగా మారిన సమత, మమతకు దాతల నుంచి రూ.16లక్షలను వారి బ్యాంకు […]
సారథి, రామడుగు: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నియోజకవర్గ సమస్యలను వదిలి హుజురాబాద్ లో ప్రచారం చేయడం ఏమిటని కాంగ్రెస్ ఇన్చార్జ్మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పలు తూముల నిర్మాణానికి వేసిన శిలాఫలకాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రూ.165కోట్ల వ్యయంతో తూములు నిర్మిస్తామని చెప్పి రెండేళ్లు అవుతున్నా రెండు రూపాయల పనిచేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో యావత్ తెలంగాణకు నీటిని తీసుకుపోవడం బాగానే ఉన్నా […]