సారథి న్యూస్, మహబూబ్ నగర్: కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు యథాతధంగా కొనసాగుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామి వారి అలంకరణ మహోత్సవం, ఉద్దాల మహోత్సవం ఆనవాయితీ ప్రకారం జరిపిస్తామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జాతర ప్రాంగణంలో ఎలాంటి గుడారాలు కానీ, స్వీట్ షాపులు, మటన్ దుకాణాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు.
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఖతల్ ఖాన్ చెరువు, ఊరచెరువులో బుధవారం చేపపిల్లలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వదిలారు. అనంతరం చెత్తసేకరణ వాహనాలను ప్రారంభించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్ పల్లి బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కొద్దిసేపు సందడి చేశారు. కాసేపు గాలంతో చేపలు పట్టారు. చిన్నచింతకుంట మండలంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో బండర్‌పల్లి వద్ద ఆగారు. అక్కడే చేపలు పడుతున్న వారి వద్దకు వెళ్లి గాలం తీసుకుని చేపలుపట్టారు. వాటిని చేతిలోకి తీసుకుని చూసి ముచ్చటపడ్డారు. […]