మాజీమంత్రి ఎం.సత్యనారాయణరావు కన్నుమూత కరోనాతో చికిత్స పొందుతూ నిమ్స్‌లో మృతి కాంగ్రెస్ దిగ్గజానికి పలువురు నేతల నివాళి సారథి, రామడుగు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజకీయాల్లో విలక్షణనేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ (87) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చివరిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కరీంనగర్జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామం. 1934 జనవరి 14న జన్మించారు. ఉస్మానియాలో ఎల్ఎల్‌బీ చదివారు. […]