Breaking News

ఎంపీపీ

వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా కట్టడి

వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా కట్టడి

సారథి, సిద్దిపేట: వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా కట్టడి చేయచ్చని ఎంపీపీ లకావత్ మానస అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ కరోనా సింటమ్స్ అయిన జ్వరం, దగ్గు, తుమ్ములు, వాంతులు ఉంటే గ్రామాల్లో నిర్వహించే కొవిడ్ టెస్టు క్యాంపుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకొవాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచి తొడేటి రమేష్ మాట్లాడుతూ గ్రామస్తులు శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్లు వాడుతూ వ్యక్తిగత శుభ్రతను పాటించాన్నారు. అనంతరం గ్రామంలో 149 […]

Read More
మాకు ప్రశ్నించే హక్కు లేదా?

మాకు ప్రశ్నించే అధికారం లేదా?

సారథి న్యూస్, వాజేడు: ‘నాకు ప్రశ్నించే అధికారం లేదా..? నేను ఓ ప్రజాప్రతినిధిని కాదా?, కనీసం నాకు విలువ లేదా?’ అని కన్నీరుమున్నీరయ్యారు ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శ్యామల శారద. మంగళవారం ఆమె జడ్పీటీసీ సభ్యురాలు తల్లడి పుష్పలతతో కలిసి స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్ పై విమర్శలు గుప్పించారు. పల్లెల్లో జరిగే పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తే తమను […]

Read More

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్, బెజ్జంకి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల పేర్కొన్నారు. గురువారం బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఆమె తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత, మార్కెట్ కమిటి చైర్మన్ పోచయ్య, సర్పంచ్ సీతా లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూమయ్య, ఎంపీటీసీ మల్లేశంగౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More