సారథి న్యూస్, హైదరాబాద్: గ్రూప్-2లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు (ప్రొబెషనరీ డిప్యూటీ తహసీల్దార్లు/డీటీలు) పోస్టింగ్‌లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 259 మంది ఎంపిక కాగా 257 మంది మాత్రమే జాయినింగ్ ఆర్డర్లు సమర్పించారు. వీరిని రెండ్రోజుల్లో విధుల్లోకి తీసుకోవాలంటూ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఆదేశించారు. 2016లో ఎంపికైన వీరికి గతేడాది నవంబరులో ప్రభుత్వం అపాయింటుమెంట్లు కల్పించింది. పోస్టింగ్‌ల కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన […]
సారథిన్యూస్, హైదరాబాద్: గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్-1 స్థాయి దాకా ఉన్న పోస్టుల్లో నియమించే అవకాశం ఉన్నది. ఆ అధికారంతోనే సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించనున్నారు. సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. ఈ […]