సారథి న్యూస్, మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్జిల్లా కలెక్టర్ఎం. ధర్మారెడ్డి శనివారం సూచించారు. పంద్రాగస్టు రోజున తయారుచేసిన ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందన్నారు. గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శించవచ్చని సూచించారు. వివరాలను 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఈనెల 31వ తేదీ వరకు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 83285 99157లో సంప్రదించాలని సూచించారు.