సామాజికసారథి, వెల్దండ: ఓ పేదింటి గిరిజన బిడ్డ మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ మంగళవారం వెలువడిన ఫలితాల్లో టాప్ లేపింది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నగారాగడ్డ తండాకు చెందిన రాత్లావత్ శారద, సల్యానాయక్ వ్యవసాయ కూలీలు. వారి కూతురు రాత్లావత్ నందిని బాలానగర్‌లో గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. 433/440 మార్కులు సాధించి అందరి శభాష్ అనిపించుకున్నది. కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్ సాధించింది. నందిని వెల్దండ ఎంపీపీ విజయ జైపాల్‌నాయక్ మరిది […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పాస్ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ మీడియట్బోర్డు ఖరారు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించనివారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. లేటు ఫీజు రూ.100తో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంపీపీ గడిపె మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 70 వేల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులున్నారని చెప్పారు.